2025 సంక్రాంతి వార్ : మళ్లీ కర్చీఫ్ వేసిన కింగ్ నాగార్జున..

2024 సంక్రాంతి వార్ ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు వరకు పండగ డేట్స్ పై కర్చీఫ్లు వేసుకుని ఆఖరికి నాలుగు సినిమాలు సంక్రాంతికి వ‌చ్చాయి. ఐదో సినిమా తప్పుకున్న ఇప్పటివరకు సరైన ప్రతిఫలం అందలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు కర్చీఫ్‌లు వేయడం 2023 ఆఖరిలో మొదలైతే.. ఈసారి ఏకంగా 11 నెలలు ముందే మొదలైపోయింది. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌రిలో ఇప్పటికే మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నాలుగో హీరో కూడా అనౌన్స్ చేశాడు.

ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్న నాగార్జున.. ఇటీవల ఈ మూవీ సక్సెస్ మీట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ చాలామంది నవ్వుకున్నా.. పిచ్చి వీళ్ళకు అనుకున్న.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చాం. విజయం దక్కించుకున్నాం. వచ్చే సంక్రాంతికి కూడా అలాగే వస్తున్నా.. అని వివరించాడు. దీన్నిబట్టి నాగార్జున తన తర్వాత సినిమాను వచ్చే పొంగల్ కి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి.

11 నెలలు ముందే అనౌన్స్ చేశారు కాబట్టి కచ్చితంగా సంక్రాంతి సమయానికి ఆ సినిమాలు సిద్ధమైపోయేలా మేకర్స్ ముందే ప్లాన్ చేసుకుంటారు. దీనికి పరోక్షంగా సంక్రాంతి బరిలో ఓ మోస్తారు సినిమాలైనా కోట్లల్లో వసూలు చేయడం కూడా కారణం కావచ్చు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిరంజీవి – వశిష్ట కాంబోలో వస్తున్న విశ్వంభరా.. ఇప్పటికీ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ చేసి మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

అలాగే గతంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన శతమానం భవతి సీక్వెల్ కూడా దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ తో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రశాంత్ వర్మ మరోసారి పోటీ పడనున్నాడు. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా ఒకటి ఉంటుందని ప్రశాంత్ వర్మ వివరించాడు. ఇప్పుడు నాగార్జున కూడా 2025సంక్రాంతి బరిలో తన సినిమా రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే అది ధనిష్‌తో చేయబోయే సినిమానా.. లేదా తన వందో సినిమానా అనేది క్లారిటీ రావాలి.