2024 CCl కోసం కసరక్తులు మొదలు పెట్టిన అఖిల్, అశ్విన్, థమన్, ప్రిన్స్.. వైరల్ అవుతున్న ఫోటో..!

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL పలు చిత్ర పరిశ్రమలోని నటీనటుల భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. టోర్నమెంట్ యొక్క 10వ ఎడిషన్ ఫిబ్రవరి 2024లో షార్జా, దుబాయ్ లో ప్రారంభం కానుంది.

ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని ప్రారంభోత్సవాన్ని తెలుగు వారియర్స్ తమ తొలి మ్యాచ్ లో భోజ్‌పురి దబాంగ్స్ తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా అఖిల్ జట్టు పోటీకి బరిలో దిగింది. ఈ ఏడాది ఎడిషన్ కోసం తెలుగు వారియర్స్ ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించింది.

ఇక తెలుగు వారియర్స్ లో భాగమైన ప్రిన్స్, అశ్విన్ మరియు థమన్ ప్రాక్టీస్ సెషన్ తరువాత కెప్టెన్ అఖిల్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ జట్టు నాలుగు సార్లు కప్పుని సొంతం చేసుకున్నారు. మరోసారి వీరే విజయం సాధించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుద్దో చూడాలి మరి.