ఆధ్యాత్మిక బాటలో మిల్కీ బ్యూటీ.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న‌ తమన్నా..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాల్లో చేస్తూ.. బోల్డ్ గా, వైల్డ్ గా కూడా కనిపిస్తూ ఫ్రీ బర్డ్‌లా నటిస్తోంది. తనని తాను మరింతగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నా మిల్కీ బ్యూటీ.. మరోవైపు పర్సనల్ లైఫ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కుటుంబంతో కలిసి దేవాలయ సందర్శనాల్లో బిజీ అయింది. ఆధ్యాత్మిక బాటలో ప‌య‌నించింది.

గౌహతిలో ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇక ఈ క్రమంలో తమన్నా లుక్‌, గెటప్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కాషాయ రంగు దుస్తులను ధరించి. మెడలో బంతిపూల దండ, దేవుడి సాలువ, నుదుటిన కుంకుమ బొట్లు పెట్టుకుని ట్రెడిషనల్ కి కేరాఫ్ అడ్రస్ గా దర్శనమిచ్చింది. ఇక‌ ఆమె దిగ్గిన‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఇక సాధారణంగా తమన్నాను మిల్కీ బ్యూటీ అని అంటూ ఉంటారు.

అయితే ఈ ఫోటోలో తమన్నా మేకప్ లెస్ గా కనిపించింది. ఇక సాధారణంగానే తమన్నాకు దేవుడంటే భక్తి. ఎక్కువ దేవాలయాలను దర్శిస్తూ ఉంటుంది. కోయంబత్తూర్ లోని ఆదియోగి శివుడిని దర్శిస్తూ.. యోగ, ప్రత్యేక పూజలు చేస్తూ ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంటుంది. కాగా ప్రస్తుతం తమన్నా ఆలయంలో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మేకప్ లేకుండా తమన్న యాపిల్ పండులా మెరుస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.