Bigg Boss 7: బిగ్ షాకింగ్.. అనారోగ్యంతో శివాజీ హౌస్ నుంచి అవుట్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ర‌స‌వ‌త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ కొత్త కొత్త కంస్టెంట్‌ల‌తో డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీజన్లో విన్నర్ ఎవరవుతారని ఎదురయ్యే ప్రశ్నలకు చాలావరకు శివాజీ, పల్లవి ప్రశాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజీ ఎప్పటికప్పుడు ఎక్కువగా ఓట్లతో ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఓటింగ్ లో శివాజీకే ఎక్కువ ఓట్లు ఫోల్ అవుతున్నాయి.

వయసులో పెద్దవాడిగా మెచ్యూర్ గేమ్ ప్లే చేస్తున్న శివాజీ.. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తన మాటకారితనంతో షోలో దూసుకుపోతున్నాడు. కాగా శివాజీ కొన్ని వారాల క్రితం టాస్క్ ఆడడంలో భాగంగా ప్రమాదానికి గురయ్యాడు. అతని భుజానికి గాయమై చాలా రోజులు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుకుంటూ ఉన్నాడు. ఒకసారి బయట హాస్పిటల్‌కి కూడా వెళ్లొచ్చాడు. ఇక రెండు వారాలకు పైగా హౌస్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ కొన్ని టాస్కల్లో మినహాయింపు కూడా అందుకున్న శివాజీ.. చెయ్యి నొప్పి వంకతో పనులు కూడా చేయడం లేదంటూ విమర్శలకు లోనయ్యాడు. ఇక బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్‌కు రావడంతో టాస్కులు మరింత కఠినంగా ఉంటాయి.

దీంతో ఎలిమినేట్ కాకుండానే హౌస్ నుంచి శివాజీని బయటకి పంప‌డానికి బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఓ విషయం వివరించాడు. ఇకపై నీ చేయికి ఏదైనా అయితే నీదే బాధ్యత.. హౌస్ లో ఉండాలనుకుంటే ఉండవచ్చు.. లేదంటే వెళ్ళిపోవచ్చు.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కొంచెం సమయం తీసుకున్న శివాజీ తన నిర్ణయాన్ని బిగ్ బాస్‌కు చెప్పాడు. చెయ్యి అయితే నొప్పి గానే ఉంటుంది. నేను టాస్కుల్లో కూడా 100% ఇస్తానని నాకు నమ్మకం కలగ‌డం లేదు.. దీంతో నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను.. అంటూ చెప్పేశాడు.

అయితే కొంత సమయం తర్వాత మళ్లీ మా నిర్ణయం చెప్తామంటూ బిగ్‌బాస్ నాగార్జునను హౌస్ లోకి పంపాడు. శివాజీ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున అతడితో డిస్కస్ చేసి ధైర్యం చెప్పాడు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడు.. అప్పటివరకు హౌస్ లో ఉండమంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో శివాజీ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయానికి బ్రేక్ వేసినట్లు అయింది. ఇక ఈ వారం డ‌బ్బుల్ ఎలిమినేషన్ ఉంద‌ని ముందుగానే నాగార్జున చెప్పాడు. దీంతో ఈ వారం అశ్విని, ర‌తిక‌ ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.