షారుక్ ఖాన్ కు వై ప్లస్ భద్రత కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కారణం ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు భద్రత.. మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా పెంచింది. పఠాన్, జవాన్ సినిమాలు విజయం సాధించిన తర్వాత ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని షారుక్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో అత‌డికి భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుక్ ఖాన్ లిఖితపూర్వక ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐజి, విఐపి భద్రత కల్పించాలని గవర్నమెంట్ ఆదేశించింది.

ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచాలని షారుక్ ఖాన్ కోరాడు. సెక్యూరిటీ కోసం తానే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక షారుక్ ఖాన్‌కు 2023వ సంవత్సరం సినిమాలపరంగా బాగా కలిసి వచ్చింది. గత కొంతకాలంగా సరైన హీట్ లేని షారుఖ్.. పఠాన్, జవాన్ సినిమాలతో రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు వ‌చ్చాయి. పఠాన్ సినిమాతో రూ.1050 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టిన షారుక్ ఖాన్.. జవాన్ సినిమాతో రూ.1100 కోట్ల భారీ గ్రాస్‌ను సంపాదించి బాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టించాడు.

ఇప్పటివరకు వచ్చిన బాలీవుడ్ సినిమాలు అన్నిటిలో అత్యధిక కలెక్షన్ జవాన్ సినిమాదే కావ‌టం గ‌మ‌నార్హం. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా షారుక్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం షారుక్ డుంకి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కుతుంది.