ఆ విషయంలో చిరంజీవి కంటే సురేఖనే 1000 రెట్లు బెటర్.. నాగబాబు ఊహించని కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు .. అంటే ఆయన ఎంత టాలెంటెడ్ అని అర్థం చేసుకోవచ్చు . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా చిరంజీవి బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్న చిరంజీవి వదిన సురేఖలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

కొన్ని విషయాల్లో చిరంజీవికి నాగబాబుకి పడనప్పుడు సురేఖ చాలా సపోర్టివ్ గా నిలిచేది అని చెప్పుకొచ్చారు. కేవలం నాగబాబునే కాదు గతంలో చిరంజీవి కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే సురేఖ చాలా చాలా మెచ్యూర్డ్ అండ్ పరిస్థితిని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

కోపం వస్తే నేను కొంతసేపు ఏం మాట్లాడనని ..మొండిగా ఉంటానని .. కానీ సురేఖ మాత్రం వెంటనే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మాట్లాడేస్తుంది అని.. ఆ విషయంలో నాకంటే నా భార్య సురేఖ వెయ్యి రెట్లు బెటర్ అంటూ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . అదే కామెంట్స్ మరోసారి నాగబాబు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!