సైబర్ వలలో పడకూడదంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..

చాలామంది సైబర్ నేరగాళ్లు చేతులో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమస్యలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ఫోటోలని మార్పిడి, లేదా బోల్డ్ వీడియోస్ కింద చేయడం వల్ల చాలామంది ఆడపిల్లలు డిప్రెషన్ కి గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వీటి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు ప్రజలు. ఇలా సైబర్ వల్ల చిక్కుకొని ఆపాస్ పాలు కాకుండా ఉండాలన్న ఎటువంటి నష్టం కలగకూడదంటే కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యకపోవడం మంచిది.

* అపరిచిత లింక్లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యవద్దు.

* వార్షికోత్సవ ఆఫర్లు, కేంద్ర ప్రభుత్వం ఆఫర్లు అంటూ వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించొద్దు.

* వ్యక్తిగత వివరాలు, బ్యాంకు పాస్వర్డ్లు, ఇతర కీలకమైన సమాచారం ఫోన్లో ఉంచుకోకపోవడమే ఉత్తమం.

* వాట్సాప్ స్టేటస్, డిపి లో మీ ఫోటోలు ఉంచుకోకపోవడం మంచిది.

* పాస్వర్డ్ రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి.

* తెలియని వ్యక్తి నుంచి కాల్ చేసి.. మెయిల్ ఐడి, బ్యాంకు ఎకౌంటు వివరాలు, చిరునామా, బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగినప్పుడు స్పందించకూడదు.
ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.