కంటి చూపుతో అందరినీ భయపెట్టే బాలయ్య.. ఆమె పేరు వింటేనే వణికి పోతాడా..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా సినిమాల్లో కొనసాగుతున్నాడు బాలకృష్ణ. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటూ సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న వరస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకీ దీటుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య భగ‌వంత్ కేస‌రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రేక్షకుల్లో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక‌ ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే బాలయ్య అంటేనే చాలామంది భయంతో వణికిపోతూ ఉంటారు. అయితే బాలయ్య చూడడానికి బయటకు గంభీరంగా కనిపించినా లోపల చాలా మంచి మనసు అని ఆయన ఎవరినైనా ఇష్టపడితే వారికోసం ప్రాణం పెట్టేస్తారని అదే ఆయనకు కోపం వస్తే కంటి చూపుతోనే భయపెడతారని స‌న్నీహితులు చెబుతూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ ఓ మహిళ పేరు చెబితే మాత్రం ఒణికిపోతాడట. ఇంతకీ బాలయ్య భయపడే ఆ లేడీ లెజెండ్ ఎవరు.. అనుకుంటున్నారా. ఆమె ఎవరో కాదు స్వయానా బాలయ్య తల్లి బసవతారకం గారు. బాలయ్య తల్లి పేరు చెబితే వణికిపోతారట.

నందమూరి తారకరామారావు- బసవ తారకం దంపతులకు బాలయ్య అంటే ఎంతో ప్రేమ. బాలయ్య చిన్నవాడు కావడంతో ఎన్టీ రామారావు బాల‌య్య‌ను చాలా ముద్దుగా గోము చేస్తూ పెంచారట. కానీ తల్లి బసవతారకం మాత్రం గారాభం చేయకుండా ప్రతి విషయంలోనూ తనని క్రమశిక్షణగా పెంచాలని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండే వారట. అందుకే బాలయ్య ఎలాంటి అల్లరి పనులు చేసిన ఆమె శిక్ష వేస్తూ తనని కంట్రోల్ చేశారు. బాలకృష్ణకు ఈ కారణంగానే తల్లి బసవతారకం అంటే చాలా భయం అని సమాచారం. అయితే బసవతారకం గారు చనిపోయిన తర్వాత ఆయన కోపాన్ని కంట్రోల్ చేసే వారు ఎవరు లేకుండా పోయారు.