“సిగ్గులేదారా నీకు..?” ..నితిన్ ను దారుణంగా అవమానించిన హీరోయిన్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కెరియర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన నితిన్ ఇప్పుడు హిట్ కోసం పరితపించిపోతున్నాడు . మరీ ముఖ్యంగా ఒక్క హిట్ తన ఖాతాలో పడితే చూడాలి అంటూ ఆశపడుతున్నారు . త్వరలోనే ఆ కోరిక కూడా నితిన్ కు తీరబోతుంది అంటూ ఎక్స్ట్రార్డినరీ సినిమా లుక్స్ చూస్తే తెలిసిపోతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే గతంలో హీరోయిన్ నితిన్ అవమానించిన విషయం మరోసారి వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరో కాదు సదా. నితిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జయం సినిమాతో సదా కూడా ఎంట్రీ ఇచ్చింది . వీళ్లిద్దరి కాంబో తెరపై బాగా సెట్ అయింది . ఆ తర్వాత పలు సినిమాలో నటించిన వీళ్ళ జోడి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది . అయితే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సదాను చూస్ చేసుకున్నాడట నితిన్ .

ఇదే విషయం ఆమెకు చెప్పగా ఫుల్ ఫైర్ అయిపోయిందట. ఒకప్పుడు నీతో సినిమాలో నటించి హీరోయిన్గా ఉన్న నన్ను మళ్ళీ మీ సినిమాలోని నన్ను ఐటం గర్ల్ గా చేయమంటున్నావా ..? నిజంగా ఇది నీకు న్యాయమేనా ..? అంటూ ఫైర్ అయిందట. దీంతో సారీ చెప్పి ఫోన్ కట్ చేసిన నితిన్ ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయాడు . అయితే సదా మాత్రం మర్చిపోలేకపోయింది ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ వద్ద ప్రస్తావిస్తూ అసలు అతనికి సిగ్గు లేదు అంటూ దారుణంగా ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్ చేసిందట . సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వకుండా ఐటం గర్ల్ గా నటించమంటాడా..? అంటూ ఫుల్ ఫైర్ అయిపోయిందట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది..!!