” దేవుళ్లు ” మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్…. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…‌.!!

కోడి రామకృష్ణ డైరెక్షన్ చేసిన ‘దేవుళ్లు’సినిమాలో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్‌లు నటించిన విషయం తెలిసిందే. వీరితోనే సినిమా అంతా సాగుతుంది. అమ్మానాన్నల గురించి వీరు పాడిన పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ఆర్టిస్టులుగా నటించిన వారు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది స్టార్లుగా మారగా.. మరికొందరు యావరేజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే చిన్నప్పుడు ఎంతో ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్టులు పెద్దాయన తరువాత స్టార్లు కాలేకపోతున్నారు. కానీ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు.

వీరు సినిమాల్లో కనిపించకపోయినా స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. తాజాగా దేవుళ్ళు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్యా శెట్టి… ఓ ప్రత్యేక ప్రోగ్రాంలో పాల్గొంది. ఆమె అందానికి కుర్రకారు షాక్ అవుతున్నారు. ఇంతకీ నిత్యాశెట్టి ఎక్కడ పాల్గొన్నారంటే? దీంతో ఆమె పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు. అందరూ అనుకున్నట్లు నిత్యాశెట్టి పెరిగి పెద్దయ్యాక “ఓ పిట్ట కథ ” అనే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మరో సినిమాలో నటించింది. కానీ నేటి తరం హీరోయిన్లతో పోటీ పడలేకపోయింది. దీంతో ఆమెకు గుర్తింపు రాలేదు.

అయితే నిత్యా శెట్టి సినిమాల్లో కనిపించకపోయినా.. పలు ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఆమె ‘క్యాష్’ ప్రోగ్రామ్ లో సందడి చేసింది. ఇందులో ఆమె అందం, అభినయం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత అందంగా ఉన్న నిత్యాశెట్టికి ఎందుకు ఆఫర్లు రావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రొగ్రామ్ లో పాల్గొన్న నిత్యాశెట్టి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం నిత్యాశెట్టి ‘హలో వరల్డ్ ’ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో నిత్యాశెట్టి హీరోయిన్ కాగా.. అనిల్ జీలా హీరో. ఈ మూవీకి నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివసాయి వర్దన్ డైరెక్షన్ చేశారు.