నిద్రరావ‌ట్లేదా… ఈ టీ తాగితే వ‌ద్ద‌న్నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది..!

సాధారణంగా కొందరికి రాత్రులు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా కంటికి కునుకు రాదు. దీన్నే నిద్రలేమి అంటారు. ఇది పెద్ద సమస్య కాదు.. అనుకుంటే పొరపాటు అవుతుంది. నిద్రలేమని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మధుమేహం, మెదడు పనితీరు మందగించడం, డిప్రెషన్, ఉబకాయం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే నిద్రలేమికి చెక్ పెట్టడం ఎంతో అవసరం.

అయితే మందులతోనే కాదు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను తరిమికొట్టొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీ రోజు నిద్రపోయే ముందు తాగితే వద్దన్నా సరే నిద్ర ముంచుకొస్తుంది. ఆ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమపువ్వు టీ నిద్రలేమిని నివారించడానికి ఒక న్యాచురల్ మెడిసిన్ అని చెప్పొచ్చు.

ఇది తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. అలాగే రెండు దంచిన యాలుకలను వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన కుంకుమపువ్వు టీను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడమే. ఇలా ప్రతిరోజు తాగితే నిద్ర చాలా బాగా పడుతుంది.