సాయి పల్లవి అలా చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఇదేం లాజిక్ రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం రీసెంట్గా ఆమె రిజెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా మారడమే . కేవలం భోళా శంకర్ మాత్రమే కాదు . గతంలో సాయి పల్లవి రిజెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరమ చెత్త డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నాయి .

అంతేకాదు ఆమె సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అన్న కన్ఫర్మేషన్ కి వచ్చేసారు అభిమానులు. కాగా ఇప్పటికే సాయి పల్లవి చాలా సినిమాలు రిజెక్ట్ చేసింది. బడాబడా స్టార్ హీరోలను సైతం ఆమె రిజెక్ట్ చేయడం గమనార్హం . రీసెంట్ గా రిలీజ్ అయ్యి పరమ చెత్త టాక్ ని సంపాదించుకున్న భోళా శంకర్ సినిమాలో ..కీర్తి సురేష్ రోల్ లో సాయి పల్లవి ని ఊహించుకున్నారు డైరెక్టర్.

అయితే రీమేక్ సినిమాలో నటించను అంటూ ముఖం మీదనే చెప్పేసింది సాయి పల్లవి. ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఏ సినిమా అయితే రిజెక్ట్ చేస్తుందో ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. దానికి ఎగ్జాంపుల్ గా భోళా శంకర్ సినిమాను చూపిస్తున్నారు..!!