యువ‌తికి పోకిరి వేధింపులు… చెప్పుతో ఎడాపెడా వాయించిన యువ‌తి ( వీడియో )

మహిళలను వేధిస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి. ఇటీవల కూడా యువతిపై ఓ పోకిరి అలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువ‌తి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆ పోకిరి గాడికి ఆమెతోనే దేహశుద్ధి చేయించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ హాపూర్ ప్రాంతంలో జరిగింది.

అసలు విషయానికి వెళ్తే ఉత్తరప్రదేశ్ హాపూర్ లోని ఓ యూతిని అదే గ్రామానికి చెందిన యువకుడు వేధించాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా పదేపదే అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ యువతి విసిగిపోయి తన కుటుంబంతో కలిసి పంచాయతీ పెద్దల్లో విషయాన్నీ వివరించింది. దీంతో ఈ విషయంపై విచారణ జరిపిన పెద్దలు యువకుడిదే తప్పుగా తెలిసి అతడికి చెప్పు దెబ్బలను శిక్ష విధించారు. ఆ యువతీతోనే అతడికి దేహశుద్ధి చేయించాలని ఫిక్స్ అయ్యారు.

40 సెకండ్లలో 15 చెప్పు దెబ్బలు కొట్టాలని పంచాయతీ వారు శిక్ష వేశారు. ఆ యువ‌తి పోకిరి గాడిని చెప్పుతో కొట్టింది. తర్వాత ఈ యువ‌కుడితో అందరి మధ్యలో చేతులు జోడించి క్షమాపణలు చెప్పించారు. అనంతరం ఓ వ్యక్తి వచ్చి అతడు చొక్కాను కూడా చింపాడు. చుట్టుపక్కల వారు కూడా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయవద్దని వార్నింగ్ ఇచ్చి అతని మెడలో చెప్పుల దండ కూడా వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.