ఆ సినిమా దొబ్బేస్తుంది అని సమంతకి ముందే తెలుసా..? అందుకే రవితేజ కి అలా చెప్పి తప్పించుకుందా..?

చాలామంది అంటూ ఉంటారు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ సమంతకు తెలివి ఎక్కువ అని.. సినిమాలో చూసింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుందని.. అయితే అది నిజమే అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అంటూ సమంత ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ప్రెసెంట్ ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ప్రజెంట్ ఆమె నటించిన ఖుషి సినిమా – సిటాడిల్ వెబ్ సిరీస్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి .

ఈ క్రమంలోనే అమెరికాలో మయోసైటీస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతుంది సమంత . ఇలాంటి క్రమంలోని సమంతకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . గతంలో సమంత వద్దకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.. డిజాస్టర్ సినిమాలు వచ్చాయి . అయితే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు హిట్ అవుతాయని తెలిసిన సమంత కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకుందట .

కానీ డిజాస్టర్ సినిమాలను మాత్రం ఓపెన్ గానే ఈ సినిమా పెద్దగా ఆడదు అందుకే రిజెక్ట్ చేస్తున్నాను అంటూ ముందే చెప్పేస్తుందట. ఆ సినిమా లో వన్ ఆఫ్ ద సినిమాగా మిగిలిపోయింది అమర్ అక్బర్ ఆంటోనీ . రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించింది . ఈ సినిమాను శ్రీను వైట్ల తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించారు . అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్గా అనుకున్నారట శ్రీనువైట్ల . అప్పటికే సమంతతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఆమెకు వెళ్లి ఈ కథను వివరించారట . అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథ వినగానే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటూ సమంత చెప్పుకొచ్చిందట . అంతే కాదు రవితేజ కాల్ చేసి రిక్వెస్ట్ చేసిన సమంత ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చిందట . సమంత అన్నట్టే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది..!!