పండ్లు తినేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తున్నారా.. అయితే అనారోగ్యం త‌ప్ప‌దు మ‌రి..!

చాలామంది పండ్లను తినడానికి ఇష్టపడతారు. పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫ్లోరేట్, పొటాషియం, ఫైబర్ ఇలా చాలా పోషకాలు పండ్లలో ఉంటాయి. అందుకే అందరూ పండ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే పండ్లను తినే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

• పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు కొన్ని పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పండ్లు తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

• పండ్లను ముక్కలుగా కోసి గంటలపాటు పక్కన పెడుతూ ఉంటారు. కట్ చేసిన తరువాత ఎప్పటికప్పుడు తినేయాలి. ముక్కలుగా కోసి పక్కన పెడితే వాటిలో ఉండే పోషకాలు అన్ని పోతాయి.

• పండ్లను జ్యూసులుగా చేసుకుని తాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల దాంట్లో ఉండే పీచు పదార్థం పోయి ఎటువంటి విటమిన్స్ ఉండవు. అందువల్ల పండ్లను నార్మల్గా తినడమే మంచిది.

• అలాగే పండ్లను రాత్రిపూట ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పండ్లను తింటే నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యం పై ప్రభావం చూపించవచ్చు.. అందువల్ల పండ్లను ఉదయం పూట తినడం చాలా మంచిది.

• ఎక్కువ రకం పండ్లను ఒకేసారి కలుపుకుని తినేస్తూ ఉంటారు. శరీరానికి పూర్తి పోషకాలు అందాలంటే ఒకటి లేదా రెండు రకాల పండ్లను తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ పండ్ల రకాలను కలపకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది.