“పవన్-జగన్” లలో నీ ఓటు ఎవరికీ వేస్తావు..? ఒక్క దెబ్బతో ఏపీ రాజకీయాల రిజల్ట్ ని టర్న్ చేసిన స్టార్ హీరోయిన్.. !!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ పై రకరకాల చర్చలు పోల్స్ .. కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటికే ఆ సందడి వాతావరణం నెలకొంది . ప్రజెంట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి . మేం మంచోలం అంటే మేము గొప్పోలం అంటూ పక్కవాళ్ళను ఏకిపారేస్తున్నారు . అయితే కేవలం రాజకీయ నాయకులే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడా ఈసారి రాజకీయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దానికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉండడమే దానికి కారణం .

కాగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా సరే సీఎం అవ్వాలని గట్టి పట్టుదలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆయన ఫ్యాన్స్ కూడా అదే విధంగా ప్రమోట్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ప్రేమ కురిపిస్తుంది ఊర్వశీ రౌతేలా. టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకున్న ఊర్వశిరౌతేలా.. రీసెంట్గా బ్రో సినిమాలో సైతం అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో మెప్పించింది.

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న ఈ బ్యూటీ కి నెటిజన్స్ నుంచి ఓ టఫ్ ప్రశ్న ఎదురయింది . 2024లో జరగబోయే ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు ..పవన్ కళ్యాణ్ కా..? జగన్మోహన్ రెడ్డికా..? అంటూ స్ట్రైట్ గా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు . అయితే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా అమ్మడు పవన్ కళ్యాణ్ సార్ కి ఓటు వేస్తాను అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అసలు ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో తెలీదు..? ఎవరు వస్తే ఎలాంటి బెనిఫిట్స్ తెస్తారో తెలియదు..? కానీ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పడం నిజంగా ఆమెకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానమే అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఆమె తెలిసి చెప్పిన తెలియక చెప్పిన.. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!