“తెలుగులో ఆ హీరో మాత్రమే బాగుంటాడు”.. అనుపమకు అంత నచ్చేసాడా..?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న.. హీరోయిన్లు ఉన్న .. ప్రతి ఒక్కరికి ఓ హీరో ఇష్టంగా ఉంటుంది . అది వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు.. వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆ హీరోని లైక్ చేస్తూ ఉంటారు. చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు సైతం ఓ హీరో అంటే ఇష్టం ఉంటూ ఉంటుంది. అయితే ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదు . కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండే హీరోయిన్ తనకు పలానా హీరో ఇష్టం అంటూ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అది కూడా పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో ఈ వార్త పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ..బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది .ప్రజెంట్ తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ సినిమాలో ఎంత హాట్ గా కనిపించబోతుంది అనుపమ పరమేశ్వరన్ రీసెంట్గా రిలీజ్ అయిన చిన్న ప్రోమో క్లారిటీ ఇచ్చేసింది .

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మీకు ఇష్టమైన హ్యాండ్ సమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది . అయితే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా అనుపమ పరమేశ్వరన్ అల్లు అర్జున్ పేరు చెప్పడం అల్లు అర్జున్ అభిమానులకు హ్యాపీగానే ఉన్న మిగిలిన హీరో ఫ్యాన్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. కేవలం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక్కడే హ్యాండ్సమ్ గా ఉన్నారా ..? మిగతా వాళ్ళు మీ కంటికి కనిపించరా మేడం..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు మిగతా హీరో ఫ్యాన్స్ . అయితే అది ఆమె ఒపీనియన్ అది చేంజ్ చేసే రైట్ ఎవరికీ లేదు అంటూ అనుపమ ఫ్యాన్స్ కూడా అనుపమ మాటలను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!