తమన్నా నటించిన సినిమాల్లో ఆమెకు నచ్చని ఏకైక మూవీ ఇదే.. ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంట్రా బాబు..!!

రీసెంట్గా హీరోయిన్ తమన్నా తాను నటించిన సినిమాలలో తనకున్న నచ్చని ఏకైక సినిమాను పేరుతో సహా బయట పెట్టేసింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ప్రజెంట్ తమన్న ఇండస్ట్రీలో ఎంత టాప్ పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. కాగా ఎంతో ఇష్టంగా తీసుకుని నటించిన రజినీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే కోలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ గురించి ..తన ఫిల్మీ కెరియర్ గురించి కొన్ని విషయాలు చెప్పుకు వచ్చింది .

ఇలాంటి క్రమంలోనే ఆమెకు తమిళ్ లో చేసిన ఓ సినిమా అస్సలు నచ్చలేదని ..ఆ సినిమాలో తన నటన చూసి తనకి విరక్తి వచ్చిందని చెప్పుకొచ్చింది . “తమిళ్ హీరో విజయ్ తమన్నా కలిసి నటించిన చిత్రం “సుర” . ఇందులోని పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చినా..సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . ఎంతలా అంటే విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది .

దీనిపై తమన్న మాట్లాడుతూ ..”అసలు నాకు ఆ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు . ఇప్పటికీ ఆ సినిమాలో నా నటన చూసి నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను . కొన్ని సీన్ సరిగ్గా రాలేదు . షూటింగ్ టైంలో వీటి గురించి ఆలోచిస్తే సరిగ్గా నటించలేం. అందుకే అవి పట్టించుకోకుండా.. నటించేసాను.. ఒక సినిమాను అంగీకరించిన తర్వాత ఎలా ఉన్నా సినిమా పూర్తి చేయాల్సిందే. తప్పదు .. జయపజయాలకు సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడలి.. రియల్ హీరోయిన్ లక్షణం అదే..” అంటూ తమన్నా చెప్పుకువచ్చింది. దీంతో తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!