మరో హీరోయిన్ జాతకం చెప్పిన వేణు స్వామి..ఏం చెప్పారో తెలుసా?

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా నిత్యం ఎదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా నిహారిక విడాకుల గురించి కూడా స్పందించారు. అంతేకాదు నిహారిక ఇంకో పెళ్లి చేసుకున్నా ఇలానే జరుగుతుందని కామెంట్స్ చేసారు. వేణు స్వామి సినిమాల గురించి, సినీ తారల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిరోజులుగా జ్యోతిష్యం కూడా చెబుతూ వస్తున్నారు. ఏ హీరోయిన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. ఇప్పుడు తాజగా వేణు స్వామి టాలీవుడ్ లో మరొక హీరోయిన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ ఉన్న హీరోయిన్ లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని తక్కువ సమయంలోనే స్టార్స్ తో నటించే అవకాశాలను సంపాదించుకుంది. ఇప్పుడు శ్రీలీల చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల దర్శకుడు రాఘవేంద్ర తీసిన పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటన, డ్యాన్స్ తో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో అందరి కళ్ళు తనమీదే పెట్టుకునే చేసింది. ఆ తరువాత రవితేజ నటించిన ధమాకా సినిమాలో నటించింది. ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు కొట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో శ్రీలీల మరోసారి అదరగొట్టింది. తన డ్యాన్స్ లతో, టైమింగ్ తో వరుస హిట్ లు సాధించింది. ఆ తరువాత వరుస సినిమాలతో శ్రీ లీల బిజీ అయిపోయింది. రామ్ పోతినేని సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలకృష్ణ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే ఇప్పుడు వేణుస్వామి శ్రీలీల జాతకం చెప్పారు. వేణు స్వామి మాట్లాడుతూ శ్రీలీలది మీనరాశి. ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది అని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న శ్రీలీల ఇలానే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది అని, త్వరలోనే టాప్ హీరోయిన్ అవుతుందని, మరో మైలు రాయిని చేరుకుంటుందని చెప్పారు. 2028 వరకు శ్రీలీల టాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయిపోతుంది. ధన ప్రవాహం కూడా పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.