ఫుల్ రొమాంటిక్ మూడ్..60 ఏళ్ల వయసులో హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్న ఆశిష్ విద్యార్థి.. ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరోలు – హీరోయిన్లు కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి .. కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అయితే మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇది పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు . ఎవరి లైఫ్ వారిది అన్నట్లు ముందుకు వెళ్ళిపోతున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ ప్రముఖులు కూడా 60 ఏళ్లు దాటాక పెళ్ళిల్లు చేసుకొని లైఫ్ లో కొత్త అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నారు .

తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి. తెలుగు – తమిళ భాషలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి ..రీసెంట్ గానే అస్సాం కు చెందిన ఫ్యాషన్ ఎంట్రప్ర్యూన్యూర్ రూపాలి ను పెళ్లి చేసుకున్నాడు . అంతకుముందే ఆశిష్ విద్యార్థికి పెళ్లయింది అని .. ఓ బాబు ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని రూపాలిను పెళ్లి చేసుకుని ఆశీష్ విద్యార్థి .. రీసెంట్గా హనీమూన్ కోసం ఏకంగా ఇండోనేషియాలో ఉన్న మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ బాలి కి వెళ్లారు.

అక్కడ ఆశిష్ విద్యార్థి – రూపాలి తెగ ఎంజాయ్ చేస్తున్నారు . దానికి సంబంధించిన పిక్స్ సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో 60 ఏళ్ల వయసులో నీకు హనీమూన్ అవసరమా..? అంటూ కొందరు ఏకి పారేస్తున్నారు. దీంతో ఆశిష్ విద్యార్ధి పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!