చచ్చిన మహేశ్ కి తండ్రి గా చేయను.. తెగేసి చెప్పేసిన టాలీవుడ్ స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే ఎలాంటి గూస్ బంప్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కృష్ణ వారసత్వాన్ని ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు చైల్డ్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా ఒక్క పాన్ ఇండియా ఫిలిం చేయకుండానే పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు .

రీసెంట్ గానే ఆయన కూతురు సితార ఘట్టమనేని ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది . ఈ క్రమంలోనే మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ఇదే క్రమంలో మహేష్ బాబు తన కెరియర్ లో ఎంతో ఇష్టంగా నటించిన దూకుడు సినిమాకి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. మహేష్ బాబు కెరియర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్-సోను సూద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా 2011లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది . అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ లో నటించాడు. ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రకాష్ రాజ్ కూడా కారణం . అయితే మహేష్ బాబు తండ్రిగా ఈ సినిమాలో ప్రకాష్ రాజు కన్నా ముందు మరో హీరోని సంప్రదించాడట డైరెక్టర్ . ఆయన మరెవరో కాదు దివంగత నటుడు శ్రీహరి. శ్రీను వైట్ల దర్శకత్వం లో శ్రీహరి కింగ్ , ఢీ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది . ఈ చనువు కారణంగానే శ్రీను వైట్ల ముందు ఆ రోల్ కోసం శ్రీహరిని అప్రోచ్ అయ్యారట . మహేష్ బాబు అన్నగా కథలో మార్పులు చేస్తే నటిస్తానని .. నాన్నగా చేయను అని తగేసి చెప్పారట . దీంతో ఆ పాత్ర ప్రకాష్ రాక్ కు వెళ్ళింది..!!