అనుష్క ని తన ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకున్న స్టార్ డైరెక్టర్..బంగారం లాంటి ఛాన్స్ ఎందుకు వదులుకున్నిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉన్నారు . అయితే ఈ మధ్యకాలంలో మూడ్ మార్చుకుని అమ్మాయిలు కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. పిల్లల్ని కూడా కన్నేశారు . అయితే 40ఏళ్లు దాటినా సరే ఇంకా అనుష్క శెట్టి పెళ్లి – పిల్లలు లేకుండా సింగిల్గానే ఉంది . అటు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా స్టార్ బ్యూటీగా రాజ్యమేలేస్తుందా..? అంటే అది లేదు .

అమ్మడు ఖాతాలో ప్రజెంట్ ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది . అది కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఈ సినిమా హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో కూడా తెలియదు . ఈ సినిమా హిట్ అయినా అమ్మడుకు అవకాశాలు వస్తాయన్న అసలు లేవు . అయితే ఎందుకు అనుష్క శెట్టి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అన్నదానికి కారణం మాత్రం ప్రభాస్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారు అని వాళ్ళ ..ఇంట్లోని పట్టింపులు వల్ల పెళ్లికి అడ్డుపడుతున్నారు.. తప్పిస్తే ..అనుష్క శెట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి .

ఇలాంటి క్రమంలోనే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తన కొడుకు ప్రకాష్ కు ఇచ్చి అనుష్క శెట్టిని వివాహం చేయాలనుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాఘవేంద్రరావు గారికి అనుష్క అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు ఈవెంట్స్ లో ఆమెపై చాలా పాజిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే అనుష్కను చూడగానే తన ఇంటికి కోడలుగా వస్తే బాగుంటుంది అంటూ అనుకున్నారట రాఘవేంద్రరావు . ఇదే విషయాన్ని అనుష్కతో కూడా వివరించారట. అనుష్క అలాంటి ఒపీనియన్ లేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చిందట .

అయితే ఆ తర్వాత రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ముంబైకి చెందిన కనిక ను పెళ్లి చేసుకున్నారు . అయితే కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు . అయితే అదే టైంలో మళ్లీ అనుష్క తో పెళ్లి చేయాలనుకున్నారట ఆ డైరెక్టర్. అయితే విడాకులు తీసుకున్న అబ్బాయిని అనుష్క యాక్సెప్ట్ చేయదని తెలిసి సైలెంట్ అయిపోయారట. అయితే కోట్ల ఆస్తి ఉన్న .. బిగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ని అనుష్క ఎందుకు రిజెక్ట్ చేసింది అన్న ప్రశ్న హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే అనుష్క మొదటి నుంచి ప్రభాస్ ని ఇష్టపడుతూనే ఉందని ..ఆ కారణంగానే రాఘవేంద్రరావును రిజెక్ట్ చేసిందని ప్రచారం జరుగుతుంది..!!