అమ్మ బాబోయ్.. అలా కనిపించి షాక్ ఇచ్చిన యాంకర్ అనసూయ..

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ మధ్య సినిమా అవకాశాలు పెరిగిపోవడంతో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది ఈ బ్యూటీ. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. తాజాగా ఈ అమ్మడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె అందం గురించి రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అనసూయ పద్దతిగా చీర కట్టుకొని కనపడింది. ఆ చీరలో అనసూయ అందం మరింత పెరిగిపోయింది. ఆ సారీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి’గందరగోళంలో ప్రశాంతతను వెతుకుంటున్న ‘ అంటూ రాసుకొచ్చింది. అనసూయ చీరకట్టులో దిగిన అందమైన ఫోటోలకు అభిమానులు లైక్స్, కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. గతంలో తనని ‘ఆంటీ’ అని పిలవద్దు అంటూ సోషల్ మీడియా లో రచ్చ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండ కావాలనే అతని ఫ్యాన్స్ తో అనసూయని తిట్టిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది. ఆ విషయం లో విజయ్ అభిమానులు అనసూయకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండ సినిమాలపై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడైతే ఎటువంటి వివాదాలకు పోకుండా సైలెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప -2 సినిమాలో నటిస్తుంది.