బన్నీ భార్యకి భారీ షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు దిమ్మతిరిపోలా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్.. స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగ స్టార్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ తో ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే స్నేహ రెడ్డి.. ఎంత టాలెంటెడ్ పర్సన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు తన ప్యాషన్ ని మరోవైపు ఫ్యామిలీని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంది .

అయితే అంతటి మంచి స్నేహ రెడ్డి అల్లు ఇంటి కోడలుగా రావాలి అంటే అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల కొన్ని కండిషన్స్ పెట్టారట . ఆశ్చర్యం ఏంటంటే అత్తగారు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకునింది స్నేహ రెడ్డి . అంతేకాదు ఆ తర్వాత ఫేవరెట్ కోడలుగా మారిపోయింది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ప్రతి తల్లి కోరుకున్నట్లే తన కొడుకుని బాధపడకూడదు అని తన కొడుకుని సంతోషంగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చిందట .

అంతేకాదు ఈ కాలం జనరేషన్ పిల్లలు చాలామంది పిల్లల్ని లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ..నువ్వు మాత్రం త్వరగా పిల్లల్ని కనాలి అంటూ కండిషన్ పెట్టిందట . అంతేకాదు అల్లు ఫ్యామిలీకి ఓ పరువు మర్యాద అంటూ ఉన్నాయి.. అయితే అవి నీవల్ల ఎప్పుడు చెడిపోకూడదు అంటూ చెప్పుకొచ్చిందంట . మూడు కండిషన్స్ కి ఒప్పుకున్న స్నేహ రెడ్డిని అల్లు ఇంటికి కోడలుగా యాక్సెప్ట్ చేసిందట నిర్మల . అయితే చూడటానికి చాలా సైలెంట్ గా ఉండే నిర్మలా పెళ్ళి విషయంలో ఇన్ని కండీషన్స్ పెట్టిందా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!