తండ్రి కారణంగా బ్లాక్ బస్టర్‌ వదులుకున్న స్టార్ హీరోయిన్… దరిద్రం అంటే ఇదే..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాకి దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.

Pushpa Review | Pushpa: The Rise - Part 1 Movie Review: It's Allu Arjun's  show all the way

పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించ్చిన రష్మిక మందన్న‌ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ సంపాదించుకొని బాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాల్లో నటిస్తుంది. పలు బ్రాండెడ్ ఐటమ్స్ కు అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తోంది. సుకుమార్ పుష్ప కథ రాసుకున్నప్పుడు సినిమాలో కొత్త హీరోయిన్ ని పెడదామనుకున్నాడ‌ట‌.

Janhvi Kapoor's birthday post for daddy Boney Kapoor is the sweetest

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే ఈ రోల్ కి చక్కగా అనిపిస్తుందని బోనీ కపూర్ కి స్క్రిప్ట్ చెప్పారట. అయితే కథ విన్న బోనీ కపూర్ మొదటి సినిమాతోనే డీ గ్లామర్‌ లుక్ లో జాన్వీ కనిపిస్తే ఆమె ఇమేజ్ డామేజ్ అవుతుందని ఈ సినిమా వ‌ద్ద‌న్నాడ‌ట‌ . అయితే ఏ మాత్రం నిరుత్సాహ పడని సుకుమార్ వెంటనే రష్మిక ను అప్రోచ్ అవడం ఆమె ఓకే చెప్పడం.. సినిమా తీయడం బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

Janhvi Kapoor to romance Allu Arjun?

ఆశ్చర్యం ఏంటంటే రష్మిక గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అంటూ చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఆ స‌మ‌యంలో జాన్వీ పుష్ప సినిమాని ఒకే చేసుంటే ఆమె రేంజ్ మ‌రో లెవ‌ల్‌లో ఉండేది. పాన్ ఇండియా రేంజ్‌లో వ‌రుస సినిమా ఆవ‌కాశ‌లు వ‌చ్చేవి అంటు దీనంతటికీ కారణం బోనీకపూర్ ఓల్డ్ థింకింగ్ అంటున్నారు జనాలు. జాన్వీ ప్ర‌స్తుతం తెలుగులో ఎన్టీఆర్‌కు జంట‌గా ఎన్టీఆర్‌30 సినిమాలో న‌టిస్తుంది. ఇక మ‌రి ఈ సినిమాతో అయ‌న జాన్వీ పాన్ ఇండియా హీరోయిన్‌గా మ‌రుతుందో లేదో చూడాలి.

Share post:

Latest