వీకే నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం గత కొద్ది నెలల నుంచి టాలీవుడ్ లో ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ జంట.. ముందు పెళ్లిళ్లకి సంబంధించిన విడాకుల పత్రాలు వస్తే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు `మళ్లీ పెళ్లి` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.
నరేశ్ హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించారు. సహజనటి జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల, వనిత విజయ్ కుమార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. కొన్నాళ్లుగా నరేశ్ రియల్‌లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న వ్యవహారాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. మే 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పవిత్ర, నరేష్ ప్రమోషన్స్ లో భాగంగా సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోకి హాజరు అయ్యారు.
ఈ వేదికపై నరేష్, పవిత్ర రొమాన్స్ తో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే మీరు పవిత్రను ముద్దుగా ఏమని పిలుస్తారని ఓంకార్ నరేష్ ని అడిగారు. `ముద్దుగా అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే… వద్దులే చెప్పకూడదు` అని అంటూ నరేష్ తెగ సిగ్గుపడ్డాడు. ఇక మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని అడగ్గా… ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటామని నరేష్ కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు, ఇద్దరు కలిసి డ్యాన్స్‌లు చేస్తూ.. ఒకరినొకరు ముద్దుల్లో ముంచెత్తారు.