టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోనే కాదు విలన్ గా కూడా నటించబోతున్నాడట. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మహేష్ కెరీర్ లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడట.
అయితే అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుంది.. ఈ పాత్ర అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా థ్రిల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన `బిజినెస్ మ్యాన్` సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అందరికీ దిమ్మతిరిగేలా చేసిన మహేష్.. ఇప్పుడు మరోసారి అలాంటి షేడ్స్‌లోనే మన ముందుకు వస్తున్నాడట. కానీ, ఈసారి ఆయన పోషించబోయే నెగటివ్ రోల్ మరింత స్పైసీగా ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇది నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలే.