అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి. అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా శ్రీదేవి పేరు తెచ్చుకుంది.54 ఏళ్ల వయసులో దుబాయ్ వెళ్లి బాత్ టబ్లో జారిపడి చనిపోయిన విషయం మనందరికి తెలిసిందే. శ్రీదేవి మరణం పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది.
అయితే తెలుగులో శ్రీదేవి ఓ స్టార్ హీరో సినిమాలో నటించమంటే ఆమె డైరెక్టర్‌కి హీరోకి కొన్ని కండిషన్లు పెట్టిందట. ఇక విషయంలోకి వెళ్తే..చిరంజీవి హీరోగా కొండవీటి దొంగ సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో ముందుగా శ్రీదేవి ని హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు కోదండరామిరెడ్డి భావించారట.
ఇక ఇదే విషయాన్ని కోదండరామిరెడ్డి శ్రీదేవి కి చెప్పడంతో కొండవీటి దొంగ టైటిల్ మార్చి ఆ టైటిల్ పక్కన కొండవీటి రాణి అని కూడా పెట్టాలని,అలా పెడితేనే తన సినిమాలో నటిస్తానని చెప్పిందట. అంతేకాకుండా ఆ సినిమాలో చిరంజీవి కంటే తన పాత్రకే ఎక్కువ ప్రియారిటీ ఉండాలని చెప్పడంతో కోదండరామిరెడ్డి శ్రీదేవిని వద్దని చెప్పి విజయశాంతి, రాధా లను హీరోయిన్స్ గా తీసుకున్నారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
అలాగే చిరంజీవి తో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ చేసే టైంలో కూడా శ్రీదేవి అలాంటి కండిషన్లే ఎన్నోపెట్టిందట. అందుకే ఆ సినిమా పేరు కు ముందుగా జగదేకవీరుడు అని ఉన్న సినిమా టైటిల్ ని పక్కన అతిలోక సుందరి అనే పేరును కూడా పెట్టారు అని అంటరు. ఇలా అప్పట్లో చిరంజీవి జంటగా నటించే సమయంలో శ్రీదేవి పెట్టిన కండిషన్లు విని చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు ఈమెకు తలపగురు చాలానే ఉంది అని అనేవారట.