`క‌స్ట‌డీ` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే చైతు ఎంత రాబ‌ట్టాలి?

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రం `కస్టడీ`. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్ గా నటించాడు. అలాగే ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాకు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. నైజాంలో ఈ మూవీ థియేట్రిక‌ల్ రైట్స్ రూ. 7.50 కోట్లకు అమ్ముడుపోయాయి. అలాగే సీడెడ్ లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 8.50 కోట్లకు క‌స్ట‌డీ రైట్స్ ను కొనుగోలు చేశారు.

మొత్తంగా తెలుగు రాస్ట్రాల్లో రూ. 18.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. అలాగే క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్‌ ఇండియాలో రూ. 1.2 కోట్లు, ఓవ‌ర్సీస్ లో రూ. 2.4 కోట్ల‌కు ఈ మూవీ థియేట్సిక‌ల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌స్ట‌డీ టోట‌ల్ బిజినెస్ రూ. 21.80 కోట్లు. అంటే ఈ మూవీతో చైతు హిట్ కొట్టాలంటే మినిమమ్ రూ. 22.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా తమిళ్ వెర్షన్ బిజినెస్ వాల్యూ రూ. 2.5 కోట్ల నుండి 3 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.

Share post:

Latest