ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!

నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత ఇంట్రెస్ట్ ఉండడంతో వీరి జీవిత కథ ఆధారంగా ఒక సినిమాని తీశారు.

వీరిద్దరు ప్రేమాయణం సహజీవనం రమ్య రఘుపతితో నరేష్కు గొడవలు పవిత్రతో తన భర్తకు జరిగిన గొడవలన్నీటిని కూడా వివరిస్తూ మళ్లీ పెళ్లి అనే సినిమాని తీశారు.. ఈ విషయాన్ని ఇటీవలే విడుదలైన టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని విడుదల చేస్తూ విడుదల తేదీని కూడా తెలియజేశారు. తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది ఆ తర్వాత నరేష్ పవిత్ర లోకేష్ ఒకచోట కూర్చుని ఉండగా భారతి మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా అని నరేష్ అడగగా ఆమె వెటకారంగానే బాగానే చూసుకుంటారని చెప్పడం జరుగుతుంది.

ఆ తర్వాత డైలాగ్ నరేష్ అసిస్టెంట్ పెళ్లయిన ఆవిడతో మీకు లవ్ ఏంటి సార్ అంటూ కామెంట్స్ చేస్తుంది. ఇక ఇందులో అన్నపూర్ణమ్మ డైలాగులు కూడా బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నరేష్ నిజజీవితంలో జరిగిన కథను కూడా చూపించడం గమనాభం దీన్ని చూస్తుంటే నరేష్ పవిత్ర జీవితాలకు సంబంధించిన రియల్ స్టోరీ అని అర్థమవుతొంది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి మరి
.<
/>

Share post:

Latest