మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్‌ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం.

నందమూరి కళ్యాణ్ రామ్:
కళ్యాణ్ రామ్‌ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేశారు .

Venkatesh excited about his singing debut in 'Guru' | Bollywood News – India TV

వెంకటేష్:
పెద్ద చదువులు పూర్తి చేసిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన అమెరికాలో MBA పూర్తి చేశారు..తర్వాత ఇండియా వచ్చి కలియుగ పాండవులు సినిమాతో సిని ప్రయాణం మొదలు పెట్టారు. నిజానికి తండ్రి రామానాయుడు వెంకటేష్ ని బిజినెస్ మెన్ ని చేద్దామనుకున్నారు.

అక్కినేని నాగార్జున:
ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పెద్ద చదువులు చదివారు. తనకు చదువు లేకపోవడంతో నాగేశ్వరరావు నాగార్జున బాగా చదువుకోవాలని ఆశపడ్డారు. నాగ్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో MS చేశారు.

Sai Dharam Tej In Coma - Clarity Here!

సాయి ధరమ్ తేజ్:
ఈ మెగా మెన అల్లుడు సాయి ధరమ్ తేజ్ బయో టెక్నాలోజి లో ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (IIPM) ఎం.బి.ఏ ని పూర్తి చేసాడు.

Hero Rajasekhar to play the villain in #Gopichand30 - TeluguBulletin.com

రాజ శేఖర్:
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఎంబిబిఎస్ చేసి కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టాడు.

రామ్ చరణ్:
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

అల్లు అర్జున్:
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ వారసుడిగా సినిమాలలోకి ఎంటర్ ఇచ్చిన అల్లుు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్‌:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. 19 ఏళ్లకే హీరోగా మారిన ఎన్టీఆర్ పెద్దగా చదువుకోలేదు. అయితే ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషల్లో పట్టుంది.