తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం తో ఎంతో మంది కుర్రకారులను ఆకట్టుకుంది హీరోయిన్ శ్రియ శరన్. ఎంతోమంది హీరోలతో నటించిన శ్రీయ అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపుగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి.. కానీ శ్రియకు మాత్రం పలు అవకాశాలు తల చిత్రాలలో వస్తూనే ఉన్నాయి.
ఇష్టం ఆనే సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. RRR చిత్రంలో కూడా రామ్ చరణ్ కి తల్లి పాత్రలో నటించి అద్భుతమైన నటనను కనబరిచింది. ఇప్పటికి పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటునే ఉంటోంది శ్రియ. ఇదంతా ఇలా ఉండగా తన భర్త ఆండ్రి అనే ఫారం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే శ్రీయ ఇంస్టాగ్రామ్ లో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. పెళ్లయిన కొద్ది రోజులకి సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఒక రూమర్ వినిపించింది.. అదేమిటంటే శ్రియ కి తన భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయని త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.. ఇదే విషయాన్ని శ్రియని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అడగగా.. అందుకు శ్రియ సమాధానం తెలుపుతూ తను నటించిన గమనం సినిమా ప్రమోషన్స్లో సినిమా గురించి మాత్రమే అడగండి పర్సనల్ లైఫ్ వద్దని చెప్పడంతో అప్పటి నుంచి ఇ రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయని తెలుపుతోంది. అయితే ఇవన్నీ నిజం కాదంటూ కూడా తెలిపింది.