తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు.
దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే ఈ మాటను ఎన్టీఆర్‌కు అలవాటు చేసుకునేలా చేసింది మాత్రం తెలుగు ప్రఖ్యాత దర్శకులు బి.యన్ రెడ్డి. ఎన్టీఆర్ కన్నా సినిమా పరిశ్రమలో బ్రదర్ పిలుపును బి.ఎన్.రెడ్డి గారు బాగా ఉపయోగించేవారు. బి.ఎన్.రెడ్డి తనకంటే పెద్దవారైనా మరోదర్శకుడు గుడవల్లి రామబ్రహ్మంను బ్రదర్ అంటు పిలిచేవాడు.
ఆయనతో పాటు రామబ్రహ్మం కూడా అదే రకంగా స్పందించేవాడు. సినిమా పరిశ్రమంలో ఎన్టీఆర్ తన గురువుగా కేవీరెడ్డి, బి.యన్.రెడ్డి, ఎల్వి ప్రసాద్ అని చెప్పేవారు. ఇక బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన మొదటి సినిమాగా మల్లేశ్వరి లో నటించారు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప సినిమాలలో ఒక సినిమాగా ఇప్పటికీ కూడా నీరాజనాలు అందుకుంటుంది.
మల్లేశ్వరి సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు బి.యన్.రెడ్డి తన తోటి వారిని ఎక్కువగా బ్రదర్ అంటూ సంబోధించేవాడు. ఎందుకనో బ్రదర్ అన్నమాట ఎన్టీఆర్ మనసుకు హత్తుకుంది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ కూడా తనకంటే పెద్దవారిని గౌరవించడం, తన పక్కవారిని బ్రదర్ అని పిలవడం ప్రారంభించారు. ఇక ఈ మాటను మన తెలుగు రాష్ట్రాలలో పాపులర్ చేశారు. ఇప్పటికీ కూడా బ్రదర్ అనే మాట వినగానే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.