కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!

పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టి‌డి‌పి, బి‌జే‌పిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ జనసేన శ్రేణులు, పవన్‌ని అభిమానించే కాపు ఓటర్లు..పవన్ మాత్రమే సి‌ఎం కావాలని కోరుకుంటున్నారు. టి‌డి‌పితో పొత్తు ఉండాలంటే సి‌ఎం సీటు డిమాండ్ చేయాలని అంటున్నారు. కానీ అది కుదరదు అని పవన్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో కాపులని వైసీపీ రెచ్చగొట్టేలా రాజకీయం చేస్తుంది. ఇక కాపులని పవన్..చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తున్నారని, కాబట్టి కాపులు ఆలోచించుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

జనసేనని అభిమానించే వారు వైసీపీకి మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. అటు మొన్నటివరకు పవన్‌కు మద్ధతు ఇచ్చిన హరిరామ జోగయ్య సైతం..కాపులకే పవన్ నాయకుడుగా ఉండాలని, ఆయనే సి‌ఎంగా ఉండాలని, అలా కాకుండా బాబుకు మద్ధతు ఇస్తే తాము ఒప్పుకోలేము అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. అయితే పొత్తులు ఎలా ఫిక్స్ అవుతాయి. ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనేది ఎన్నికల సమయంలోనే తేలుతుంది.

కానీ పొత్తుని చెడగొట్టి ఎలాగోలా లబ్ది పొందాలనే కాన్సెప్ట్ తో వైసీపీ ఉంది. ఒకవేళ పొత్తు ఉన్నా సరే..అంతా కలిసి వస్తుంటే..తాము మాత్రం సింగిల్ గా సింహం మాదిరి వస్తున్నామని చెప్పుకుని ఓట్లు దండుకునే విధంగా వైసీపీ స్కెచ్ వేస్తుంది. చూడాలి మరి జనం ఎవరిని ఆదరిస్తారో.