చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు.

Chanti Telugu Full Length Movie - Venkatesh Movies - YouTube

అయితే స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు దర్శకుడు రవిరాజా పినిశెట్టి పలుమార్పులు చేయటం.. అలాగే వెంకటేష్ త‌న‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి మరి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించడంతో చంటి సినిమా సంచలన రికార్డులను సృష్టించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనా కూడా తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. ఇళయరాజా అందించిన సంగీతం కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.

Hyderabad: Kushboo reveals her father sexually abused her when she was eight

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనా ఫస్ట్ ఛాయిస్ కాదట.. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాను రిజెక్ట్ చేస్తే మీనాని ఫైనల్ చేశారట. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరి ఎవరో కాదు ఖుష్బూ. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయాలని దర్శక నిర్మాతలు ఆమెను కోరితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.

Chanti - SparkOTT

దర్శకనిర్మాతలు మొదటిగా ఈమెను సంప్రదించడానికి కారణం.. ఒరిజినల్ లో అంటే ‘చిన్న తంబి’ లో కూడా హీరోయిన్ గా ఖుష్భూనే నటించడం వల్ల అని చెప్పాలి. అయితే మీనా కూడా ‘చంటి’ కి రైట్ సెలక్షన్ అని ప్రూవ్ చేసింది. ఆమె లుక్స్ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.