“తీరిందా.. దూల తీరిపోయిందా..?”.. ఒక్క పిక్ తో నోర్లు మూయించిన బన్నీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పని పాటలేని బ్యాచ్ ఎక్కువగా మెగా ఫ్యామిలీ పై పడి ఏడుస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నా సరే దాన్ని అటు ఇటు తిప్పి మెగా ఫ్యామిలీకి ముడి పెట్టడం కొందరి ట్రోలర్స్ కి అలవాటుగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య ఓ వార్ జరుగుతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే .

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ విష్ చేయకపోవడం ఒక నెగటివ్ రిమార్క్ అయితే ..ఆయన అంత గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్ అటెండ్ కాకపోవడం సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లకు తావు తీసింది . ఈ క్రమంలోనే కొందరు మెగా – అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తూ ఫ్యామిలీ లను ట్రోల్ చేశారు . ఇదే క్రమంలో అలాంటి వాటికి చెక్ పెడుతూ బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో లేటెస్ట్ పిక్ని షేర్ చేశారు . ఈ పిక్ ఆధారంగా బన్నీ – స్నేహ రెడ్డి మెగా ఫ్యామిలీ ఆడపడుచులతో వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది.

ఈ ఫోటోల్లో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిలతో పాటు చిరంజీవి కూతురు శ్రీజ , సుస్మిత కూడా జాయిన్ అయ్యారు . ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో ఈ టూర్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరి వెకేషన్ కి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఈ ఫొటోస్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘాటుగా బదులిస్తున్నారు.

ఇప్పటికైనా మెగా – అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అన్న వాళ్లకు దూల తీరిందా? నిజంగా మెగా – అల్లు కుటుంబం మధ్య గొడవలు ఉంటే వాళ్ళ కూతుర్లు ఎందుకు ఇలా వీళ్ళ ఫ్యామిలీతో టూర్లకు వెళ్తారు . బుర్ర పెట్టి ఆలోచించండి ఇకనైనా మీ పని మీరు చూసుకోండి అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఒక మాట అనకుండా బన్నీ తనపై ట్రోల్ చేసే వాళ్ళకి ఘాటుగా ఇచ్చి పడేశారు అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు..!!

Share post:

Latest