ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దే వద్దు అంటూ దిల్‌రాజుతో బన్నీ గొడవ..?

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ చేయకుండానే సుకుమార్ తో కలిసి పుష్ప మూవీ చేశాడు. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ టైం పట్టడం అది పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కావడం వల్ల బన్నీ ఇప్పుడు పుష్ప టు మూవీకే పరిమితమయ్యాడు. ఫలితంగా ఐకాన్ మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.

కాగా తాజా నివేదికల ప్రకారం, దిల్ రాజు ఇటీవల ఐకాన్ అనే టైటిల్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చారు. అంటే దిల్ రాజుకి ఇంకా ఈ సినిమా చేయాలనే ఉద్దేశం ఉంది. అల్లు అర్జున్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో ఐకాన్ సినిమా ఏదో ఒక సమయంలో ప్రారంభిస్తామని చెప్తూ వస్తున్నాడు. బన్నీ నీ ఫ్యాన్స్ ‘ఐకాన్ స్టార్’ అని కూడా పిలుస్తారు. అయితే నేషనల్ వైడ్‌గా పుష్పతో ఫేమ్ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ లాంటి దర్శకుడితో పని చేయడానికి సుముకత చూపట్లేదట. గతంలో కొత్త డైరెక్టర్ తో నా పేరు సూర్య సినిమా చేసి బన్నీ చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ ఇప్పుడు నాలుగైదు సినిమాలు తీసిన డైరెక్టర్లను నమ్మి ఇలాంటి తప్పును ఎప్పటికీ రిపీట్ చేయనని బన్నీ అంటున్నాడట. ఇక నుంచి స్టార్ డైరెక్టర్స్‌తో మాత్రమే అసోసియేట్ అవ్వాలని అనుకుంటున్నాడట.

దిల్ రాజు అడిగినప్పుడల్లా వేణు శ్రీ రామ్ వద్దే వద్దు అంటూ గొడవలు కూడా పెట్టుకుంటున్నాడట. ఒకవేళ అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ సినిమా రూపొందితే, దిల్ రాజు కచ్చితంగా పెద్ద దర్శకుడ్ని రంగంలోకి దింపుతాడు. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రాజెక్ట్ ఐకాన్‌ను ఎలా, ఎప్పుడు, ఎవరితో తీయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Share post:

Latest