టీడీపీ కోటలని కూల్చనున్న జగన్?

ఇప్పటికే జగన్ దెబ్బ ఏంటో టీడీపీకి బాగా తెలిసింది…జగన్ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బడా బడా నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. టీడీపీకి ఓటమి పెద్దగా తెలియని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అంటే ఎలా ఉంటుందో జగన్ చూపించారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ ని తట్టుకుని 23 చోట్ల టీడీపీ గెలిచింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు లాగేసిన విషయం తెలిసిందే.

అలాగే మిగిలిన సీట్లపై కూడా జగన్ ఫోకస్ పెట్టి…వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో విశాఖ సిటీపై జగన్ ఫుల్ ఫోకస్ ఉన్న విషయం తెలిసిందే…పైగా ఎగ్జిక్యూటివ్ రాజధాని కూడా కాబోతుంది కాబట్టి..విశాఖ నగరంలో బలపడటమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నగరంలో ఉన్న నాలుగు సీట్లలో టీడీపీ బలాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Ys Jagan : జగన్ ఆ పని చేస్తే టీడీపీని శాశ్వతంగా మూసేస్తారట | The Telugu News

గత ఎన్నికల్లో నగరంలోని నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంది…అయితే ఆ నాలుగు చోట్ల టీడీపీని దెబ్బకొట్టడమే జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే క్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ని వైసీపీలోకి లాగారు. అలాగే విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు.

అటు విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాసరావు అడ్రెస్ లేరు..ఇక్కడ వైసీపీ నేత కే‌కే రాజు దూకుడుగా పనిచేస్తూ…నియోజకవర్గంలో బలం పెంచుకున్నారు. ఇక మూడు సార్లు వరుసగా విశాఖ ఈస్ట్ లో గెలిచిన వెలగపూడి రామకృష్ణ బలాన్ని సైతం తగ్గించారు. ఈ సీటులో అక్రమాని విజయనిర్మల బలం పెరిగేలా చేశారు. అలాగే విశాఖ వెస్ట్ లో గణబాబు బలం కూడా పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికి చూసుకుంటే ఈ సారి విశాఖలో టీడీపీ కోటలు కూలిపోయేలా ఉన్నాయి.