మ‌రోసారి భీమ్లానాయ‌క్‌తో ప‌వ‌న్‌కు ఎదురు దెబ్బేనా ?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన మ‌ల్లూవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప కోషియ‌మ్ రీమేక్ భీమ్లానాయ‌క్ మ‌రో మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యామీన‌న్‌, రానాకు జోడీగా మ‌ళ‌య‌ళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆల్రెడీ మ‌ళ‌యాళంలో హిట్ అయిన సినిమా కావ‌డంతో పాటు ఇక్క‌డ త్రివిక్ర‌మ్ మార్క్ స్క్రీన్‌ప్లే, మాట‌ల స‌హకారం ఉండ‌డంతో ఈ సినిమా హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు, ఆశ‌ల‌తో మెగా, ప‌వ‌న్ అభిమానులు ఉన్నారు.

ఈ సినిమాకు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా రు. 100 కోట్ల‌కు పైనే జ‌రిగింది. అయితే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు అన్నీ పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌డం లేదు. అస‌లు ప‌వ‌న్ సొంత క‌థ‌ల‌తో న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డం అనేది అత్తారింటికి దారేది సినిమాతోనే ఆగిపోయిన‌ట్టు ఉంది. ఆ సినిమాకు ముందు చేసిన హిట్ గ‌బ్బ‌ర్‌సింగ్ రీమేక్‌. గోపాల గోపాల – కామ‌ట‌రాయుడుతో పాటు గ‌తేడాది చేసిన వ‌కీల్‌సాబ్ కూడా రీమేక్ సినిమాయే..!

ఇక సర్దార్ గబ్బ‌ర్‌సింగ్ కూడా ప‌వ‌న్ స్వ‌యంగా రాసుకున్న క‌థ‌. అజ్ఞాత‌వాసి కూడా డైరెక్ట్ స్టోరీ కాదు.. అది ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గానే తీశారే త‌ప్పా త్రివిక్ర‌మ్ సొంత క‌థ కాద‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి. ఇప్పుడు భీమ్లానాయ‌క్ కూడా అయ్య‌ప్ప కోషియ‌మ్‌కు రీమేక్‌. ఇలా ప‌వ‌న్ వ‌రుస పెట్టి రీమేక్‌లు చేయ‌డం.. అవి క‌లిసిరాక‌పోవ‌డం జ‌రుగుతోంది. మ‌రి ఈ సినిమా మ‌ళ‌యాళంలో ఎంత హిట్ అయ్యి.. త్రివిక్ర‌మ్ హ్యాండ్ ప‌డినా క‌థ‌, క‌థ‌నాలు ఇప్ప‌టికే చాలా మందికి తెలుసు.

పైగా ఒరిజిన‌ల్ సినిమాను కూడా చాలా మంది చూసేశారు. ఈ లెక్క‌న చూస్తే ఈ బ్యాడ్ సెంటిమెంట్ భీమ్లానాయ‌క్ రిజ‌ల్ట్‌ను టెన్ష‌న్ పెడుతోన్న ప‌రిస్థితి ఉంది. మ‌రి ఈ సెంటిమెంట్‌ను ఈ సినిమా ఎంత వ‌ర‌కు చిత్తు చేస్తుందో ? చూడాలి.