వేట మొదలైంది..#NBK107 నుండి కేకపెట్టించే అప్డేట్..బాలయ్య చంపేసావు పో సామీ..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తమ అభిమాన నటుడు సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు ఆనందాని అవధులు లేకుండా పోయాయి. గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ‘అఖండ’ మాస్ జాతరతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా తరువాత వస్తున్న సినిమా అంటే అభిమానులు బాలయ్య నుంచి ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు.

ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా..డైరెక్టర్ గోపీచంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బడ్జేట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా సినిమాను అధ్బుతంగా తెరకెక్కించేందుకు అన్ని విధాలా ట్రై చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 18 మొదలైంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. బాలయ్య పిక్ ని పోస్ట్ చేస్తూ.. ఈ మేరకు గోపీచంద్ మల్లినేని పోస్ట్ చేస్తూ..బాలకృష్ణ గారితో వర్క చేయడాం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తాము. ఇది ప్రారంభం మాత్రమే &వేట ఇప్పుడే మొదలైంది. ఇక విపరీతంగా ఉంటుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను..అంటూ రాసుకొచ్చారు. ఇక బాలయ్య ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు అచ్చం వేటాడే సిం హం లాగే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక దీని బట్టి చూస్తే ఈ సినిమాకి వేటపాలెం అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన ఈమె బాలయ్య ను ఢీ కొట్టే రోల్ లో నటించనుంది. కాగా ఈ మూవీలో ప్రముఖ‌ క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నారని..అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్ రోల్ కాగా మరోకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ రోల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ను డైరెక్టర్ రాయ‌లసీమ బ్యాక్‌డ్రాప్‌లో వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా రాబోతున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కున్న టాక్‌. ఏది ఏమైనా బాలకృష్ణ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ సినిమా పడనుంది అని ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.