`శ్యామ్ సింగ‌రాయ్‌` 4 డేస్ క‌లెక్ష‌న్స్..నాని ఇరగదీస్తున్నాడుగా!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది.

నాని ద్విపాత్ర‌భిన‌యం, రాహుల్ డైరెక్ష‌న్‌, సాయి ప‌ల్ల‌వి స్క్రీన్ ప్ర‌జెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇక టాక్ బాగుండ‌టంతో ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని నాని బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ ఇర‌గ‌దీస్తున్నాడు.

ఈ చిత్రం 4వ రోజు ఏపీ, తెలంగాణలోనే రూ.1.38 కోట్ల షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో దాదాపు 19.45 కోట్లు షేర్ రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్ దిశ‌గా దూసుకుపోతోంది. ఇక‌ శ్యామ్ సింగ‌రాయ్ ఏరియాల వారీగా నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి..

నైజాం- 6.90 కోట్లు
సీడెడ్- 1.82 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.55 కోట్లు
ఈస్ట్- 0.68 కోట్లు
వెస్ట్- 0.57 కోట్లు
గుంటూరు- 0.76 కోట్లు
కృష్ణా- 0.64 కోట్లు
నెల్లూరు- 0.43 కోట్లు
—————————————————————————–
ఏపీ+తెలంగా 4 డేస్‌ కలెక్షన్స్- 13.45 కోట్లు (22.90 కోట్లు గ్రాస్)
—————————————————————————–
కర్ణాకట+రెస్ట్ ఆఫ్ ఇండియా- 2.40 కోట్లు
ఓవర్సీస్- 3.20 కోట్లు
టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 19.04 కోట్లు (34.00 కోట్లు గ్రాస్)

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.22 కోట్ల బిజినెస్ చేసిన శ్యామ్ సింగ‌రాయ్ ..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.22.5 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంటుంది. అయితే మొద‌టి నాలుగు రోజుల్లోనే రూ.19.04 కోట్లు వసూలు చేసేసిన నాని.. క్లీన్ హిట్ కొట్టాలంటే ఇంకా రూ.3.46 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుని స‌రిపోతుంది.