మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10వ తేదీ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బేకపై వెళ్తుండగా.. తేజ్ స్కిడ్‌డై కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో తేజ్ కి తీవ్ర గాయాలు కావడంతో.. ఆపోలో హాస్పటల్‌లో దాదాపు నెల రోజుల పాటు చికత్స తీసుకున్నాడు.
ఆపై డిశ్చార్జై మెల్ల మెల్లగా కోలుకున్న తేజ్.. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇలాంటి తరుణంలో సాయి ధరమ్ తేజ్‌కి కొత్త తలనొప్పి మొదలైంది. ఆయన యాక్సిడెంట్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న నేరాల నివేదికను ఆయన సోమవారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్‌మీట్‌లో కమిషనర్ స్టీఫెన్ రవింద్ర తేజ్ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడుతూ.. `హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాం.
బైక్ లైసెన్స్. ఆర్‌సీ, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు అన్ని వివరాలు తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నాం. కానీ, ఇప్పటి వరకు దానిపై సాయి ధరమ్ తేజ్ స్పందించలేదు. అందు వల్ల మరి కొద్ది రోజుల్లో ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం` అంటూ తెలిపారు. మరి ఇప్పటికైనా సాయి తేజ్ పోలీసులకు వివరణ ఇస్తాడో..లేదో..వేచి చూడాలి.