కేటీఆర్.. పాపులర్ పొలిటీషియన్..

కల్వకుంట్ల తారక రామారావు.. సింపుల్ గా కేటీఆర్ సన్నాఫ్ సీఎం కేసీఆర్.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఆయన కేసీఆర్ కుమారుడిగా కాక సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంత అంటే.. 30 లక్షల మంది (మూడు మిలియన్లు) తనను ఫాలో అయ్యేంత.. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం గత సంవత్సరం నుంచే 10 లక్షల మంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను చూస్తున్నారు. 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరంగా మంత్రిత్వ బాధ్యతలు చూస్తూనే పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్ విధులు నిర్వర్తిస్తుండటం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో కేటీఆర్ సోషల్ లీడర్ అయ్యారు.

ట్యాంక్ బండ్ పై నడుస్తూ హుసేన్ సాగర్ అందాలను వీక్షించడానికి కనీసం ఆదివారం సాయంత్రం వేళల్లో వాహనాలను అనుమతించకండి అని ఒక నెటిజన్ కోరిన కోరిక వల్లే ఇపుడు సండే సాయంత్రం ట్యాంక్ బండ్ పై వాహనాలను అనుమతించడం లేదు. దీనికి కారణం కేటీఆర్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటం వల్లే.. కోవిడ్ కష్టకాలంలో కూడా సోషల మీడియా ద్వరా అనేక మందిని ఆదుకున్నారు. రవాణా సమస్యలు, ఆస్పత్రుల్లో ఇబ్బందులు, మందులు, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు తదితర సమస్యలకు కేటీఆర్ క్షణాల్లో స్పందించే వారు. అందుకే కొంత కాలంగా ట్విట్టర్ లో ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫాలోవర్లతో ముచ్చటించేటప్పుడు కేటీఆర్ చాలా సరదాగా ఉంటారు కూడా. ఏది ఏమైనా ఆపదలోఉన్న వారిని ఆదుకుంటూ ప్రజల మన్నన చూరగొంటున్నారు కేటీఆర్..