ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించేశారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాలు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు తగిన ప్రణాళిక కూడా ప్రకటించేశారు. అయితే ప్రతిపక్ష నేత ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద, బడుగు వర్గాలకు చేరువయ్యేందుకు 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]
Tag: YS Jagan
వైసీపీ ప్లీనరీ ప్లాపా..హిట్టా..యావరేజా..!
స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజమై ఉన్న క్యాడర్‌లో `నవ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీనరీ వేదికగా అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాడు. ఎన్నికల హామీలు రెండేళ్ల ముందుగానే ప్రకటిస్తూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ప్లీనరీ సూపర్ హిట్ అయిందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇది కేవలం చంద్రబాబును తిట్టడానికేనని, ఇది అట్టర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీనరీ మాత్రం యావరేజ్ అని విశ్లేషకులు అంచనా […]
ఆంధ్రజ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయకుల పని అంతే..!
ప్రస్తుతం తెలుగు మీడియాలో చాలా పత్రికలు పార్టీలకు కరపత్రికలుగా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలు – పత్రికలు కరపత్రికలు అన్న అంశంపై తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయిందన్నది నిజం. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు తమ సభలు, సమావేశాలకు అనుమతించడం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థలను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]
`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!!
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కుమ్ములాటలకు కొదవలేదు. ఇవి నిత్యం రగులుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ కంటే తూర్పు గోదావరిలో కొంత బలం ఉన్న విషయం తెలిసిందే! అందుకే మరింత బలపడేం దుకు ఒక్కో నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒకరికంటే ఎక్కువమందిని నియమించేశారు. ఇవే ఇప్పుడు ఆయనకు తలనొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా తమకేటికెట్ దక్కుతుందని.. […]
ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం
తాను ఎవరి మాట లెక్కచేయబోనని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు ఆయన మనస్తత్వం గురించి తెలుసు కనుక సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోవడం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్‌కు కూడా జగన్ ఝలక్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్టమైనదే చేస్తా` అని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే బాగుంటుందనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]
వైసీపీలోకి నాగార్జున…. జగన్‌తో కింగ్ డీల్ ఏంటి
దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన్మథుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బయటా నాగార్జున వ్యక్తిత్వం కాస్త భిన్నం. వివాదాలకు దూరంగా అందరితోను సమన్వయంతో ముందుకు వెళ్లే నాగ్‌ది పక్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి చాలా రెట్లు ఎలా రాబట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే నాగ్ అక్రమ ఆస్తులు, కట్టడాలను టార్గెట్ […]
పీకే జవాబుతో అందరూ ఫూల్స్
`వైసీపీ అధినేత జగన్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కిషోర్ సర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మరోసారి విజయం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేశారు. ప్రస్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేతలను ఇరుకున పెట్టి సోషల్ మీడియాలో వీలైనంత వరకూ లబ్ధి పొందాలని చూసిన వీరంతా.. `ఇదంతా […]
జగన్‌లో మార్పు వెనుక కారణాలివేనా..
సీఎం చంద్రబాబు 2014లో అధికారంలోకి రావడానికి ఆయన సీనియరిటీనేగాక, ఉద్యోగులు కూడా కొంత కారణం! 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గతంలోలా ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించను` అని చంద్రబాబు పదేపదే చెబుతూ వారిలో నమ్మకం కలిగేలా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిపక్ష నేత జగన్.. ఇప్పటినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]
ప్రశాంత్ ప్రభావం జగన్‌పై పడిందిగా..
`నువ్వు మారాలి.. నీ వ్యవహార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియర్ నేతలు ఎంతమంది చెప్పినా పట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్రతిపక్ష నేత జగన్!! నిన్నమొన్నటి వరకూ టీడీపీ నేతలు కూడా ఆయన వ్యవహారశైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జగన్ నిజంగానే మారిపోయారు. ఇటీవల ఆయన పాల్గొన్న సంఘటనలు, ఆయన మాటతీరు గమనించి వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం […]
