టీడీపీని, ఆ పార్టీ అధినేతను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాలపై మోస్తోంది ఆంధ్రజ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి సొంత ప్రయోజనాలు వారివి! బాధ్యతాయుతమైన పత్రికగా ఉంటూ విలువలు పాటించాల్సిన అవసరం కూడా చాలా ముఖ్యం! ఇటీవల ఆ పత్రికలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే.. విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టేనని అర్థమవు తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరో కల్పించి రాసిన వాటి ఆధారంగా […]
Tag: YS Jagan
వైసీపీలోకి సీనియర్.. అమరావతిలో టీడీపీకి ఇబ్బందే!
విపక్షం వైసీపీకి రాజధాని ప్రాంతం అమరావతిలో గట్టి పట్టు దొరుకుతోందా? వచ్చే ఎన్నికల్లో విజయవాడ ప్రాంతంలో పార్టీని ముందుండి నడిపించగల నేత వస్తున్నాడా? ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి.. మొగుడు లాంటి కేండిట్ వైసీపీలోకి వస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. గతంలో సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన మల్లాది విష్ణు ఇప్పుడు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని రెండు మూడు రోజులుగా […]
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలలో టెన్షన్..టెన్షన్
ఏపీలో వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికి అయినా ఈ ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు అందరి నోట ప్రశాంత్ సర్వే మాటే వినిపిస్తోంది. ప్రశాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసి గ్రామస్థాయి గ్రామస్థాయి వరకు రిపోర్టులు తయారు చేయించారు. ఈ సర్వే నివేదికలు జగన్ వద్దకు వెళ్లిపోయాయి. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవి అన్నీ పాటిస్తున్నాడన్న లీకులు వైసీపీ నాయకులందరికి తెలిసిపోయాయి. దీంతో […]
టార్గెట్ జగన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్‌ను, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విడదీసి చూడలేం! అంతలా కాంగ్రెస్‌ను తనలో ఐక్యం చేసేసుకున్నాయాన! ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా జగన్ వైపు వెళ్లిపోవడం.. ఇదే సమయంలో విభజన జరగడం.. ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఏపీలో కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల సమయానికి కొంతైనా పుంజుకోవాలని పార్టీ తహతహలాడుతోంది. ఇదే సమయంలో వైఎస్ పేరు చెప్పి.. తమ […]
సోషల్ మీడియా చేతికి చిక్కిన జగన్
సీఎం నారా చంద్రబాబు, ఆయన తనయుడు పొరపాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారు! ఎన్ని మాటలు అన్నారు! సోషల్ మీడియాలో ఎంతటి ప్రచారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్యలను పదేపదే టీవీలో చూపిస్తూ.. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మరి ఇప్పుడు స్వయంగా వాళ్ల అధినేత జగన్ తడబడ్డారు. నిందితులను అనబోయి ఏకంగా బాధితులనే అరెస్టుచేయాలని సలహాలిచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ సమాధానం […]
క్యాస్ట్ పాలిటిక్స్ వద్దంటోన్న జగన్
కుల రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఆసక్తికరంగాను, సామరస్యపూర్వకంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులకు, దళితేతరులకు మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై చెలరేగిన గొడవ కాస్తా పెద్దదిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన దళిత నాయకులు సైతం అక్కడకు చేరుకుని గరగపర్రులో బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ కోవలోనే వైసీపీ అధినేత వైఎస్.జగన్ సైతం శుక్రవారం గరగపర్రుకు వెళ్లి అక్కడ సాంఘిక […]
జగన్ కోసం ఒక్కటైన తెర వెనక లీడర్లు..!
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడనుందా? 2019లో జగన్ సీఎం కల నెరవేరబోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దివంగత వైఎస్ మిత్రులు, సన్నిహితులు అందరూ జగన్‌కి జట్టుగా కలిసి రావాలని డిసైడ్ అయ్యారట. వైఎస్ అధికారంలో ఉండగా ఆయనతో ఎంతో చెలిమి చేసిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్‌ని సీఎంని చేసే బాధ్యత తీసుకున్నారని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్రధాన చక్రం […]
జగన్‌కి ఘట్టమనేని వారి స్థలం!
వైసీపీ అధినేత జగన్‌కి ఘట్టమనేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికున్న రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అండ్ ఆదిశేషగిరిరావులు ఆయన వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ తరఫున పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఘట్టమనేని వారి మద్దతు జగన్‌కే ఉండేది. అయినా కూడా ఘట్టమనేని కుటుంబం జగన్ పట్ల విధేయతగానే ఉంది. తాజాగా జగన్‌కి ఆదిశేషగిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నారని వార్త వచ్చింది. రాష్ట్ర బైఫర్ కేషన్ […]
వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?
బొత్సా సత్యనారాయణ. పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా సాగిన ఉత్తరాంధ్ర నాయకుడు. విభజనతో కునాల్లిన కాంగ్రెస్‌ను వదిలేసి వచ్చి.. వైఎస్ తనయుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొదట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వచ్చేందుకు తాత్సారం చేసినా.. తర్వాత తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి స్థాయిలో మాట్లాడడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌లపైనా వారి వ్యాపారం హెరిటేజ్‌పైనా ఆయన విమర్శల బాణాలు సంధించారు కూడా. […]
