ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

గరం..గరం..గద్వాల రాజకీయం

డీకే అరుణ.. అప్పట్లో కాం‍గ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ […]

కారులో ఇమడలేకపోతున్న డీఎస్!

ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]

ఖమ్మం కాంగ్రెస్ లో వార్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకం.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ జిల్లాలో మంచి ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్టకడుతోందంటే ఖమ్మం జిల్లా వల్లే అని చెప్పవచ్చు. అయితే ఇపుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ రెండు గ్రూపులు పోటీ పడుతుండంతో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు […]

తలపట్టుకుంటున్న రేవంత్

తెలుగుదేశం పార్టీలో ఉండి.. చంద్రబాబు అనుచరుడిగా ఎదిగి.. ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన వాగ్ధాటితో రాహుల్ గాంధీని మెప్పించి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పార్టీలో ఇంకా ఫుల్ సపోర్టు లభించలేదు. సరికదా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అయినా సరే.. రేవంత్ అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ముందుకు లాగుతున్నాడు. సభలు, సమావేశాలు, మీడియా మీటింగ్స్ నిర్వహిస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నాడు. […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ […]

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]

యూపీలో ‘పవర్‌’ పాలిటిక్స్‌

ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. మోదీ, అమిత్‌ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా పక్కా ప్లాన్‌ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్‌ […]