జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు.
సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ గా పని చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. సుదర్శన్ రావు మృతితో అనసూయ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మరణవార్త తెలియడంతో అనసూయ వెంటనే తార్నాకలోని నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.