గత కొన్ని రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉండటం లేదు..కేవలం ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలనే చూసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళడం లేదు. గత నెలలో కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లలేరు. పార్టీ పరంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు..పార్టీ బలోపేతంపై చర్చలు చేస్తున్నారు. అలాగే ఇంచార్జ్‌లని చోట..కొత్తగా ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. ఇలా పార్టీ పరమైన కార్యక్రమాలే చేస్తూ వచ్చారు. […]
Tag: chandrababu
బాబు-పవన్ మరోసారి భేటీ..ఇంకా సెట్ అయినట్లేనా?
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఇటీవల ఎన్డీయే సమావేశానికి వెళ్లొచ్చిన పవన్..పొత్తులపై కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపి-జనసేన-బిజేపి పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. ఇటు టిడిపి శ్రేణులు ఏమో పొత్తు వద్దు ఒంటరిగానే బరిలో ఉందామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బాబు-పవన్ భేటీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ ఇద్దరు మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. […]
జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!
ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సిఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ […]
పొత్తులపై టీడీపీ క్లారిటీ ఇదే..కమ్యూనిస్టులతోనే..!
ఏపీలో పొత్తులపై ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో టిడిపి-బిజేపి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మూడు పార్టీలు కలుస్తాయని పవన్ అన్నారు. అలాగే సిఎం సీటు ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని అన్నారు. ఇలా పవన్ పొత్తులపై మాట్లాడిన నేపథ్యంలో టిడిపి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం ఎవరితో ఎలాంటి పొత్తు వద్దని, బిజేపితో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. […]
బెజవాడ రాజకీయం..కేశినేని వైపే బాబు.?
మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టిడిపిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. […]
బాబుకు పొత్తుల టెన్షన్..పవన్ ముంచుతున్నారా?
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బిజేపితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బిజేపితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టిడిపిపై పడుతుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ […]
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి..పవన్ మాట..బాబు బాట.!
వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టిడిపి-జనసేన-బిజేపి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజేపితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టిడిపి..బిజేపితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]
ఎన్డీయేలో మీటింగ్‌కి పవన్..బాబు కోసమేనా?
మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బిజేపి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం […]
తిరువూరు తమ్ముళ్ళకు బాబు క్లాస్..ఈ సారైనా గట్టెక్కుతారా?
అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తిరువూరులో టిడిపి పరిస్తితి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు..కేడర్ ఉంది..అయినా సరే టిడిపి గెలిచి 20 ఏళ్ళు అయిపోయింది. అంటే నాయకులు ఉన్నా సరే వారి మధ్య సమన్వయం లేదు. ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు ఉంటుంది..అందుకే ఇక్కడ టిడిపి గెలవడం కష్టమవుతుంది. 1999 వరకు ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచి టిడిపికి ఏది కలిసిరావడం లేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో […]







