నాడు వైఎస్ బాబును కొట్టిన దెబ్బే ఇప్పుడు జ‌గ‌న్‌కా…?

ఏపీ రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. వ్యూహాలు , ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం ఎప్పుడూ హీటెక్కుతూనే వ‌స్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు, వైఎస్సార్ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన పోటీ ఉన్న‌ప్పుడూ రాజ‌కీయం ఎలా ఉండేదో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య కూడా అంతే హీట్‌గా న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏ అస్త్రం వాడి చంద్ర‌బాబును ఆ ఎన్నిక‌ల్లో దెబ్బ కొట్టారో ఇప్పుడు అదే అస్త్రం వాడి చంద్ర‌బాబు కూడా […]

రాజ్య‌స‌భ సీట్లు : బాబు – ప‌వ‌న్ – బీజేపీ డీల్ ఇలా కుదిరిందా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే జూన్ నెల‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో వైసీపీ గెలుచుకున్న‌వే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేత‌ల్లో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవ‌రెవ‌రు పంచుకోవాల‌నే దానిపై ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ […]

మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. […]

ఆ పార్టీల్లో వారికి గుర్తింపు తక్కువేనా….!

తెలుగుదేశం పార్టీ అంటే.. అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే కులం కమ్మ. వాస్తవానికి ఏపీలో ఒక్కొ పార్టీనీ ఒక్కో కులం సొంతం చేసుకుందనటంలో సందేహం లేదు. టీడీపీని చౌదరీలు, జనసేనను కాపులు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకుంది. ఈ పార్టీ మాది అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయా పార్టీలకు సొంత సామాజిక వర్గాలే దూరమవుతున్నాయనటంలో సందేహమే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధినేతలే ఆయా వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరు […]

అవును.. అక్కడ వాళ్లదే రాజ్యం….!

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత […]

పదవీ కాలం ముగిసింది…. అయినా అధికారంలో ఎలా…?

పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉంటుందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం పార్టీలు మారే వాళ్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు తిట్టిన నోటీతోనే… పదవి ఇచ్చిన పార్టీ నేతను ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. ఇక పదవిలో ఉన్న వారు అయితే… నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే… పదవి కోసం కావాల్సిన అడ్డదార్లు అన్నీ తొక్కేస్తున్నారు కూడా. పార్టీ అధికారంలో లేకపోయినా సరే… తనదే పెత్తనం అంటున్నారు […]

ఏపీలో నామినేటెడ్ పదవులపై ఫుల్ క్లారిటీ…!

ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా […]

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వీఆర్ శ్రీలక్ష్మీ

ప్రజల సమస్యలు తీర్చగల ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శ్రీ లక్ష్మీ శ్యామల పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. మరో వారం రోజుల్లో ఏపీలో వైసీపీ కథ […]

టీడీపీ అభ్యర్థులు మారతారా….?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తుండగా… వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం అంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ నేత పవన్ కూడా వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. […]