కేంద్రంలో కొత్త మంత్రుల హిస్ట‌రీ ఇదే..

కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీర‌బోతున్న మంత్రుల‌కు అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాల‌కు మోడీ త‌న టీంలో చోటు క‌ల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. మ‌రి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్‌ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా […]

జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర […]

ఆ మీడియా రైజింగ్ వెన‌క లోకేష్ హ్యాండ్‌..!

ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్న‌ట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అంత‌గా స‌ర్క్యులేష‌న్‌, అంత‌గా పాఠ‌కులు లేని ప‌త్రిక ఇప్పుడు ఏపీలో పాఠ‌కుల వేట‌లో ప‌డ‌డంతో పాటు అత్యాధునిక హంగుల‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక […]

ఆ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్‌కు అగ్నిప‌రీక్షే

ఇప్పుడు తెలంగాణ‌లో ఈ కామెంట్లే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తే.. అధికార పార్టీ ఇరుకున ప‌డ‌డం ఖాయం అనే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటో? ఉప ఎన్నిక ఎందుకు వ‌స్తుందో చూద్దాం… కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత‌, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తూ.. ఆయ‌న వెంట‌నే రాజీనామా […]

వైసీపీకి మంచి జోష్..ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు!

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు కూడా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని టీడీపీ మంత్రులు కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహ‌సం ఎవ‌రైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజ‌కీయాల్లో అవ‌కాశం కోసం కాచుకుని కూర్చొనే […]

బాల‌య్య చ‌ర్చ‌లు…ఆ పార్టీ ఏపీ టీడీపీలో విలీనం..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్ల‌ను, టీడీపీ అభిమానుల‌ను జ‌గ‌న్ రెచ్చ‌గొట్టి మ‌రీ నంద్యాల ఉప ఎన్నిక‌తో ఫామ్‌లోకి తీసుకువ‌చ్చాడు. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు టీడీపీ సైనికులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో ఓ విధ‌మైన నిస్తేజం నెల‌కొంది. ఎప్పుడైతే జ‌గ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సంప్ర‌దాయానికి విరుద్ధంగా త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌డంతో పాటు టీడీపీ నుంచి వ‌చ్చిన శిల్పా మోహ‌న్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డం, […]

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వైఎస్ఆర్‌

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒక‌రు. 2009లో హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో ఆక‌స్మికంగా వైఎస్ చ‌నిపోయారు. వైఎస్ మ‌ర‌ణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయినా ఆయ‌న చేసిన సేవ‌లు, ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు, ఆయ‌న ప‌రిపాల‌న‌ను మాత్రం తెలుగు ప్ర‌జ‌లు అంత తొంద‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఆయ‌న పాల‌న అంత‌లా చెర‌గ‌ని ముద్ర‌వేసింది తెలుగు ప్ర‌జ‌ల‌పై. రాజ‌కీయాల్లో వ్య‌క్తుల‌పై ప్ర‌త్యర్థులు ఆరోప‌ణలు […]

టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవ‌రు..?

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజ‌కీయాల‌ను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న స‌చివాల‌యంలో ఉండాల్సిన మంత్రుల‌తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలంద‌రిని అక్క‌డే మోహ‌రించేశారు. తాను సైతం చివ‌రి రెండు రోజులు నంద్యాల‌లో ప్ర‌చారం చేశారు. ఇక విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ అయితే త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మోహ‌రించ‌డంతో పాటు తాను ఏకంగా […]

శిల్పా బ్ర‌ద‌ర్స్‌ను వ‌ద‌ల బొమ్మాళి

రాత్రికి రాత్రే బండ్లు ఓడ‌లు…ఓడ‌లు బ‌ళ్లు అవుతాయ‌న్న సామెత ఉంది. ఆవేశంలో…అసంతృప్తిలో నిర్ణయాలు తీసుకుంటే అవి అనర్ధాలకు దారి తీస్తాయని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన శిల్పా బ్రదర్స్ విషయంలో అది నిజమైంది. శిల్పా బ్రదర్స్ గురించి తెలిసిన వారందరికీ, వారి ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆవేదన కలుగుతుందని చెప్ప‌క తప్ప‌దు. నెల‌న్న‌ర రోజుల క్రితం టీడీపీలో మ‌హ‌రాజుల్లా ఉన్న వీరు ఇప్పుడు చేతిలో ఉన్న ప‌ద‌వుల‌తో పాటు, డ‌బ్బులు పోగొట్టుకుని […]